ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సీనియంట్రోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ని ఏపి సచివాలయంలో కావలి నియోజకవర్గ ఇంచార్జి అళహరి సుధాకర్ మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కలిసి వారికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అత్యంత పొడవైన సముద్ర తీరం వెంబడి ఉన్న రామాయపట్నం, తుమ్మలపెంట, మైపాడు, కొత్త కోడూరు, కృష్ణపట్నం, తూపిలి పాలెం, శ్రీనివాస సత్రం, బీచ్ లను పర్యాటకేంద్రాలుగా అభివృద్ధికి అనువుగా ఉన్నాయని, ముఖ్యంగా చెన్నై నుండి విజయవాడ హైవేలో అతిదగ్గరగా ఉన్న సముద్ర తీరం కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట బీచ్, కావున పర్యాటక కేంద్రంగా బోట్ షికారుకి, రిసార్ట్స్ ఏర్పాటు చేస్తే మా జిల్లానుంచి ప్రభుత్వానికి ఆదాయవనరు అవుతుందని తెలిపారు. టెంపుల్ టూరిజం, పర్యాటకరంగ పరంగా నెల్లూరు జిల్లాని అభివృద్ధి చెయ్యొచ్చని విన్నవించడం జరిగింది. ఈ బేటీలో జనసేన నాయకులు నెల్లూరు టౌన్ ప్రెసిడెంట్ సుజయ్ బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్, కోవూరు నియోజకవర్గ సమన్వయకర్త చిప్పడి శ్రీనివాసులు రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment