కావలి, బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కావలి పాలెంలో బాబు & యువత అధ్వర్యములో అంబేద్కర్ పార్క్ లో మరియు బ్రిడ్జి సెంటర్లలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు నియోజకవర్గ నాయకులు, జనసైనికులు వీరమహిళలు పాల్గొనగా నియోజకవర్గ ఇంచార్జ్ అళహరి సుధాకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేత్కర్ ని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వారు ఉన్నత చదువులు చదివిన వారు, ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, వీరు అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా చేసిన వ్యక్తి, ప్రతీ ఒక్క యువత తప్పక చదువుకోవాలని సంఘానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో వీర మహిళ కొప్పుల లక్ష్మి, పట్టణ అధ్యక్షుడు పొబ్బా సాయి, ఉపాధ్యక్షుడు నాగార్జున, ఐ.టి కో-ఆర్డినేటర్ బాలు, నాయకులు మస్తాన్, ఆలా శ్రీనాథ్, కృష్ణయ్య, ప్రవీణ్, రాజేష్, నాని, మురళి, సాదు శ్రీధర్, మత్యాకార అధ్యక్షుడు డా.రవి, కమిటీ నాయకులు యానాదయ్య, రాజేంద్రప్రసాద్, బాబు, వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, మునితాత, శివ, గిరి, పోలయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment