ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మనుబోలు శ్రీనివాస రావు

తిరువూరు, గంపలగూడెం మండలంలోని గాదెవారిగూడెం గ్రామంలో తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి కూటమి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క జనసేన నాయకుడు జనసైనికులు పనిచేయాలని మనుబోలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించుకుంటే విద్య, ఉద్యోగ, సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు చేర్చడానికి కృషి చేస్తున్నారన్నారు. టిడిపి జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటికి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా జన సైనికులు అందరూ పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు చింతలపాటి వెంకట కృష్ణారావు, గాదెవారి గూడెం గ్రామ సర్పంచ్ చెన్నా శ్రీనివాసరావు, కోయ రామకృష్ణ, రావూరి రవి, గాదె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment