చిలకలూరిపేట, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం పట్టభద్రుల కలల సాకారానికి నాంది అని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ కూటమిలో రాజకీయ నాయకుల మధ్య సమన్వయం, వ్యూహాత్మక ఎత్తుగడలు, ప్రచార సరళి, ప్రభుత్వంపై పట్టభద్రుల్లో ఉన్న సానుకూలత కూటమి అభ్యర్ది అలపాటి విజయానికి దారితీశాయని విశ్లేషించారు. ప్రభుత్వంపై నమ్మకంతో ఉద్యోగులు మద్దతుగా నిలిచారని బాలాజి చెప్పారు. కూటమి 9 నెలల పాలనను సైతం బేరీజు వేసుకున్న పట్టభద్రులు అధికారపక్షంవైపు మొగ్గు చూపారని, కూటమి వచ్చినప్పట్నుంచి చేపట్టిన కార్యక్రమాలు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపుకు బాటలు వేశాయని వెల్లడించారు. ఉన్నత విద్యావంతుల గెలుపు ద్వారానే నిరుద్యోగ యువత కలలు సాకారమౌతాయన్న బలమైన నమ్మకంతోనే అన్ని వర్గాల ప్రజలు ఆదరించారని, మద్దతుగా నిలిచారని వివరించారు. రాష్ట్రప్రగతి, అభివృద్ధికి ఓటు వేయాలని పట్టభద్రులు ఓటు వేశారని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి పూర్తి స్థాయిలో వెల్లడైన సంతృప్తి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్పుటమైందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అభి వృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారని, ఏటా జాబ్‌కార్డు విడుదల చేస్తానని, మెగా డీఎస్సీ తీస్తామని యువతను మోసం చేశారన్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులు, ఉన్నత విద్యను గాడిన పెట్టేందుకు వీసీల నియామకం తదితర అంశాలు ఎమ్మెల్సీ అభ్యర్ధి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయానికి బాటలు వేశాయని పేర్కొన్నారు.
Share this content:
Post Comment