మేధావుల మద్దతుతో ఆలపాటి విజయం నల్లేరు మీద నడకే: ఆళ్ళ హరి

సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆలపాటి రాజాకు పట్టభద్రులు పట్టాభిషేకం చేయనున్నారని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. సమస్యల్ని పరిష్కరించటంలో ఘనాపాటి ఆలపాటి అంటూ వ్యాఖ్యానించారు. మంగళవారం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాకు మద్దతుగా జనసేన పార్టీ శ్రేణులు పలు విద్యాసంస్థల్లో ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులతో పాటూ పలువురు విద్యాధికులను కలిసి ఆలపాటి రాజాకి మొదటి ప్రాధాన్యత ఓటుని వేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉండటానికి ఇష్టపడే ఆలపాటి రాజా గొంతుక పెద్దల సభకు అవసరమన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన విజయాన్ని మించి కూటమి అభ్యర్దిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజాకు రికార్డ్ స్థాయి మెజారిటీ ఇచ్చి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఆళ్ళ హరి కోరారు. కార్యక్రమంలో విద్యాసంస్థల నేత సందు శివ నాగేశ్వరరావు, జనసేన డివిజన్ అధ్యక్షులు మామిడి రామారావు, దాసరి వెంకటేశ్వరరావు, భూషయ్య, కరీదు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment