కలెక్టర్ ఆఫీసును వెంటనే మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేసిన ఆలేటి నరేందర్ గౌడ్

వరంగల్ జిల్లా, తూ తూ మంత్రంగా కలెక్టర్ ఆఫీస్ కట్టి ఐదు ఆరు నెలలు గడవక ముందే గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షం ధాటికి కలెక్టర్ ఆఫీస్ జలమయం అయింది. జనగామ జిల్లా ఎప్పుడు నాయకులకు చిన్న చూపే, నాణ్యత లేని కట్టడాలను ఇకనైనా మానుకోవాలని, అంతేకాకుండా దోపిడి నాయకుల వల్ల డబ్బు వృధా అయ్యింది. జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీసును వెంటనే మరమ్మత్తులు చేయాలని జనసేన పార్టీ వరంగల్ జిల్లా యువజన అధ్యక్షుడు ఆలేటి నరేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంద నాగరాజు, కేమిది, జాని, బొట్ల, రాకేష్ క్రాంతి, వెంకటేష్, పవన్ కుమార్, విజయ్, కె.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.