రాక్షస సంహారం కోసం అన్ని శక్తులు ఒకటవడాన్ని స్వాగతిస్తున్నాం: వాసగిరి మణికంఠ

♦️ జనసేనాని నిర్ణయం టిడిపి, జనసేన పొత్తుని స్వాగతిస్తున్నాం
♦️ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మా నాయకుడు పవన్ కళ్యాణ్ పై చౌకబారు విమర్శలు మానుకోవాలి
♦️ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామిదేవాలయం హుండీలో నగదు చోరీపై తక్షణం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి అని డిమాండ్.
♦️ అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ
♦️ జనసేన పార్టీ గుత్తి మండల, పట్టణ అధ్యక్షులు పోతురాజుల చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్

అనంతపురం జిల్లా, గుంతకల్ నియోజకవర్గం, గుత్తి పట్టణం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో జనసేన శ్రేణులు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ సరైన సమయంలో రాష్ట్ర ప్రయోజనాల దృశ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఉద్దేశంతో జనసేన, టిడిపి పొత్తుని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, జనసేన టిడిపి కలిసి వచ్చే బిజెపితో ప్రజా సమస్యలపై గట్టిగా నిలదీయగలమన్నారు, ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని, వైకాపా చేస్తున్న అక్రమాలను మరో ఆరు నెలల్లో ఉమ్మడిగా చమర గీతం పాడుతామన్నారు. త్వరలోనే ఉమ్మడిగా ఐక్య కార్యాచరణ ప్రకటించుకుని 2024లో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గుంతకల్ నియోజకవర్గంలో పొత్తులో భాగంగా జనసేన, టిడిపి, బిజెపి ఏ పార్టీకి టికెట్ వచ్చినా పొత్తు ధర్మం పాటిస్తూ ఐక్యంగా ఉమ్మడి జెండాను ఎగరవేస్తాం. పొత్తులో భాగంగా ఎలాంటి త్యాగలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. గుంతకల్ శాసనసభ్యులు వెంకటరామిరెడ్డి అంటే మాకు గౌరవం ఉందని ఆయన కూడా ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని చాలా సంవత్సరాలు తర్వాత రాజకీయంగా నిలదుక్కుకున్నారు. గతంలో మెగా అభిమానిగా అతనిని ఆదరించామని కానీ మా నాయకుడిని పవన్ కళ్యాణ్ ను అగౌరపరిచే విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, మమ్మల్ని విమర్శించడాన్ని పక్కనపెట్టి పరిపాలన మీద దృష్టి సారించాలని విన్నవించారు. ముఖ్యంగా నిన్న గాక మొన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలోని హుండీలో నగదు చోరీకి పాల్పడిన ఘటన మన ఊరికి, మన జిల్లాకి తీరని కలంకమని వెంటనే అఘాయిత్యానికి పాల్పడిన సెక్యూరిటీ ఆఫీసర్, ఈ ఘటన వెనక ఉన్న దుష్టశక్తులపై ప్రభుత్వము, సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలి, హిందూ భక్తాదుల మనోభావాలు దెబ్బతినే విధంగా అంత యదేచ్చగా హుండీ చోరీ పాల్పడడాన్ని చూస్తుంటే అనేక అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి కావున నిష్పక్షపాతంగా గుంతకల్ ఎమ్మెల్యే, వైసీపీ ప్రభుత్వం విచారణ జరిపించి ఈ దుశ్చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షాన మా మిత్రపక్ష పార్టీలతో కలిసి ఉమ్మడిగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఏది ఏమైనా 2024 లో ఈ నియంత పాలనకు స్వస్తిపలకాలని ప్రజలను, ప్రజాస్వామ్యవాదులను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ గుత్తి పట్టణ, మండల అధ్యక్షులు పోతురాజుల చిన్నవెంకటేశులు, పాటిల్ సురేష్ సీనియర్ నాయకులు గోరంట్ల నాగయ్య రాయల్, వెంకటపతి నాయుడు, అఖండ్ భాష, ఖాదర్ వలీ తదితరులు పాల్గొన్నారు.