- ఏపి జే యు 35 వ వార్షికోత్సవ సంవత్సరానికి ఆరంభం
కోనసీమ జిల్లా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కూచిపూడి నాట్యం జన్మస్థలం కృష్ణా జిల్లాలోని కూచిపూడిలోని ఎస్ ఎస్ ఎల్ కన్వెన్షన్ సెంటర్ లో అఖిల భారత వార్త పత్రిక ఉద్యోగుల సమాఖ్య కేంద్ర కార్యవర్గ సమావేశాలు ఈ నెల 23, 24వ తేదీలలో జరుగుతాయని, ఈ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఫర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా (ఏపి జే యు) అతిధ్యం ఇస్తున్నట్లు ఏపి జే యు ప్రధాన కార్యదర్శి మరియు ఏ ఐ ఎన్ ఈ ఎఫ్ సీనియర్ ఉపాధ్యక్షులు చలాది పూర్ణచంద్ర రావు, ఏపి జే యు కొశాధికారి ఆర్ డి ప్రసాద్ లు తెలిపారు. దేశంలోని అనేక రాష్ట్రాలనుండి సిడబ్ల్యూసి ప్రతినిధులు హాజరయ్యే ఆ సమావేశాలలో జాతీయ స్థాయిలో జర్నలిస్టులు, ముఖ్యంగా గ్రామీణ విలేకర్లు ధీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించటం, జాతీయ పెన్షన్ పధకం అమలుపై కేంద్రానికి, ప్రధాని నరేంద్రమోదికి వివరించేందుకు ప్రతినిధి వర్గాన్ని ఏర్పాటు జరుగుతుందన్నారు. ఈ సమావేశాలు 23 వతేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఫర్ ప్రింట్ అండ్ మీడియా(ఏపి జే యు) గౌరవాధ్యక్షులు, ప్రముఖ పాత్రికేయులు మండలి బుద్ధప్రసాద్ ప్రారంభిస్తారని, పూర్ణచంద్ర రావు, ఆర్ డి ప్రసాద్ లు తెలిపారు. ఈ సమావేశాల ప్రారంభం కి ముందుగా మన తెలుగువారి వారసత్వ నాట్యకళ అయిన శ్రీ సిద్దేంద్ర కళాపీఠం నృత్య విద్యార్థులచే కూచిపూడి నృత్యం ప్రదర్శన ఉంటుందన్నారు.అనంతరం ప్రారంభం సభ నిర్వహించటం జరుగుతుందని వారు తెలిపారు. ఏపి జే యు 35 వ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా ఈ సంవత్సరం అంతా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అందుకు ప్రారంభ సూచనగా బుద్ధప్రసాద్ ఏపి జే యు జెండా ఎగురవేసి ప్రకటిస్తారన్నారు. 35ఏళ్లుగా ఆడంబరం లేకుండా, అనేక అడ్డంకులని సైతం లెక్కలేకుండా ఎదుర్కొని,చరిత్రలో డిస్ క్వాలిఫై అనేది లేకుండా నిరాటంకంగా సాగుతు,అనేక జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు సాధించటం పట్ల సంతృప్తిని వారు వ్యక్తం చేశారు. ఇన్నేళ్లపాటు ఏపీజేయుకి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించిన వివిధ మహనీయులను, యూనియన్ కి అన్నివిధాలా చేయూత ఇచ్చి అలంబనగా ఉన్న శ్రేయోభిలాషులకు చంద్రునికో నూలు పోగులా ఆరోజు సత్కరించుకునే అవకాశం ఉందని పూర్ణచంద్ర రావు, ఆర్ డి ప్రసాద్ లు తెలిపారు. సభానంతరం నాట్య కళాశాల శ్రీ సిద్దేంద్ర కళాపీఠం, కార్పొరేట్ వైద్య సేవలు తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంతంలో అందిస్తున్న రవిప్రకాష్ సంజీవని సిలికాన్ఆంధ్ర ఆసుపత్రి సందర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశాలకు తొలినుండి అండదండలిస్తున్న చీకటిమర్ల శివరామప్రసాద్, కోనేరు ఆనంద్, బెల్లంకొండ వెంకటేశ్వర రావు లతో పాటు పలువురు శ్రేయోభిలాషులు చేస్తున్న సహకారం మరువలేమని, వారికి కృతఙ్ఞతలు తెలుపుతున్నట్లు ఈ సందర్భంగా పూర్ణచంద్ర రావు, ఆర్ డి ప్రసాద్ లు తెలిపారు.
Share this content:
Post Comment