రేషన్ కిట్స్ అందజేసిన అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం

కర్ణాటక, అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం నుండి శుక్రవారం విడుదలైన భీమ్లా నాయక్ చిత్రం సందర్భంగా సిడ్లఘట్ట నియోజకవర్గం జనసేన కమిటీ తరఫునుంచి బీద వాళ్లకు రేషన్ కిట్స్ అందించడం జరిగింది. ఈ సహాయానికి స్పందించిన అందరికీ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో చిక్కబల్లాపూర్ జిల్లా అధ్యక్షులు హరీష్ ఆపిల్, గౌరవ అధ్యక్షులు వెంకటేష్, తాలూకా అధ్యక్షులు బుజ్జి, ప్రదీప్, జానీ, రాజు, విజయ్, లోకేష్, అభిమానులు పాల్గొన్నారు.