మిరియాల శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం

బెంగళూరు, జనసేన పార్టీ ఐటి విభాగం చైర్మన్ మిరియాల శ్రీనివాస్ ని అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం అధ్యక్షులు మురళి గౌడ, కమిటీ సభ్యులు అనిల్ బెంగళూరులో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐటి టీం అందిస్తున్న సేవలకు విలువ కట్టలెమని, జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు తమవంతు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉయ్యాల శ్రీనివాస్, మధు కుమార్, భారత్ బాబు, లక్ష్మి నారాయణ, రాజేష్ కుమార్, హరీష్, రవి, ఐటి టీం సభ్యులు, అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.