24 గంటల్లో ‘వకీల్‌ సాబ్’ ట్రైలర్‌ క్రియేట్‌ చేసిన సరి కొత్త రికార్డ్స్

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. అంచనాలు ఎలా ఉన్నాయనడానికి తాజాగా విడుదలైన ట్రైలర్‌ సృష్టించిన, సృష్టిస్తోన్న ప్రభంజనమే సాక్ష్యం. వ్యూస్‌, లైక్స్‌ పరంగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను, ఇంతకు ముందు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో లేని రికార్డులను ఈ ట్రైలర్‌ క్రియేట్‌ చేసింది. 24 గంటల్లో ఈ ట్రైలర్‌ క్రియేట్‌ చేసిన రికార్డులను చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

సోమవారం సాయంత్రం 6గంటలకు ఈ ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌ విడుదలైన 24 గంటల్లో ఇప్పటి వరకు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఏ సినిమా ట్రైలర్‌ సాధించని రికార్డులను వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌ క్రియేట్‌ చేస్తూ వచ్చింది. గంట గంటకి మిలియన్ల వ్యూస్‌ పెరుగుతూనే వచ్చాయి. అలాగే లైక్స్‌ విషయంలో కూడా టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఏ ట్రైలర్‌కు రాని లైక్స్‌ ఈ ట్రైలర్‌కు రావడం విశేషం. వ్యూస్‌, లైక్స్‌ పరంగా.. టాలీవుడ్‌లో ఇప్పుడు వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌దే టాప్‌ ప్లేస్‌ మరియు రికార్డ్‌. ఈ ట్రైలర్‌ 24 గంటల్లో.. 22.44 మిలియన్ల వ్యూస్‌ రాబట్టగా.. 1 మిలియన్‌ లైక్స్‌ (23 గంటల 39 నిమిషాల్లో) సాధించి.. పవన్‌ కల్యాణ్‌ పవర్‌ ఏంటో మరోసారి టాలీవుడ్‌కి చూపించేలా చేసింది ‘వకీల్‌ సాబ్‌’ ట్రైలర్‌.

ఆల్రెడీ హిందీలో విడుదలైన సినిమా, అలాగే తమిళ్‌లో రీమేక్‌ అయిన ‘పింక్‌’ రీమేక్‌ ట్రైలర్‌తో ఇటువంటి రికార్డులు సృష్టించడం కేవలం పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కే సాధ్యం అనేలా.. ఇప్పుడు మెగాభిమానులు కాలర్లు ఎగరేస్తున్నారు. అలాగే నిర్మాత దిల్‌ రాజు కూడా.. ప్రమోషన్‌ విషయంలో చేసిన ప్లాన్‌ బాగా వర్కౌట్‌ అవ్వడంతో.. ఆయనపై కూడా మెగాభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.