మహాదేవుని ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలి

*వీరంపాలెం క్షేత్రాన్ని దర్శించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్

తాడేపల్లిగూడెం: మహాదేవుని కరుణ, కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆకాంక్షించారు. శివరాత్రి మహా పర్వదినం సందర్భంగా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పంచాయతన క్షేత్రంలో బుధవారం స్వామివారి మహా కుంభాభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పవిత్ర పుణ్యక్షేత్రం వీరంపాలెం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలను కాశీ మాదిరిగా నిర్వహిస్తూ దానిలో తమను భాగస్వాములను చేసిన వెంకటరమణ శాస్త్రికి రుణపడి ఉంటామన్నారు. మహదేవుని ఆశీస్సులతో రాష్ట్రం, అందరూ సుభీక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. గత వైసిపి హయాంలో నిర్బంధాల పాలన సాగిందని ఆ సమయంలో వీరంపాలెం దర్శించుకునే అవకాశం తనకు కలగలేదని మళ్లీ ఆయన ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రజామోదమైన కూటమి ప్రభుత్వ పాలన మొదలైంది అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మంచి జరుగుతుందని ఆకాంక్షించారు. అనంతరం కలెక్టర్ చదలవాడ నాగరాణి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Screenshot-26-02-2025-at-21.18 మహాదేవుని ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలి

Share this content:

Post Comment