కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషితో గుంటూరు నగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆనందాన్ని వ్యక్తం చేసారు. తొమ్మిది నెలల్లోనే నగరాభివృద్ధికి కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడంలో పెమ్మసాని విజయాన్ని అందుకున్నారు. ఆదివారం బృందావన్ గార్డెన్స్ లోని ఎంపీ కార్యాలయంలో జనసేన నేతలు పెమ్మసానిని కలసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలతో చేసిన హామీలను నెరవేర్చేందుకు పెమ్మసాని నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్న పెమ్మసాని ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు. ఆయన గత దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులకు మార్గం చూపిస్తున్నారని తెలిపారు. మూడు వంతెనల నిర్మాణం, నాలుగు లైన్ల రహదారులు, ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి వంటి ఎన్నో ప్రాజెక్టులకు నిధులు తీసుకొచ్చి వాటిలో ఎన్ఆర్‌ఐలను భాగస్వామ్యులను చేసిన పెమ్మసాని కృషిని ప్రశంసించారు. ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశీస్సులు ఆయనపై ఎప్పటికీ ఉండాలని ఆళ్ల హరి ఆకాంక్షించారు. పెమ్మసానిని సన్మానించిన వారిలో రెల్లి నేత సోమి ఉదయ్ కుమార్, టీడీపీ నాయకులు ముత్తినేని రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment