ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయమే కూటమిలక్ష్యం: వడ్రాణం మార్కండేయ బాబు

గురజాల, స్థానిక సిపిఐ కళ్యాణమండపంలో ఏర్పాటుచేసిన జనసేన పార్టీ సర్వసభ్య సమావేశంలో నరసరావుపేట పార్లమెంటరీ ఎన్నికల సమన్వయకర్త జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు వడ్రాణం మార్కండేయ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందిస్తున్న ప్రజా సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రగతిని మునుముందుకు తీసుకెళ్తున్నాయని, ఉమ్మడి గుంటూరు – కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్స్ శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను గెలిపించడమే లక్ష్యంగా జనసేన పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన కోరారు. ఆలపాటి విజయం కూటమి ఐక్యతకు ప్రామాణికం కాబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు, పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు కామిశెట్టి రమేష్, జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, బడిదెల శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కాసిం సైదా, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పిడి నరసింహారావు, బొమ్మ శ్రీనివాసరావు, పాముల కిషోర్, నియోజకవర్గ అధికార ప్రతినిధి అడపా వెంకట్, మండల పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామ అధ్యక్షులు, పట్టణ పార్టీ నాయకులు, కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment