‘అహం బ్రహ్మాస్మి’లో అతిథి పాత్రలో అల్లరి నరేశ్!

‘అల్లరి’ నరేశ్ పేరు హాస్యానికి చిరునామాగా మారిపోయింది. తన కెరియర్ ను మొదలుపెట్టిన చాలా తక్కువ సమయంలోనే కథానాయకుడిగా ఆయన 50 సినిమాలను పూర్తిచేశాడు. నరేశ్ కి నవ్వించడమే కాదు .. కన్నీళ్లు పెట్టించడం కూడా వచ్చు అని నిరూపించే సినిమాలు కూడా చేశాడు. ‘మహర్షి’ సినిమా నుంచి ఆయన ముఖ్యమైన పాత్రలను చేయడం మొదలుపెట్టాడు.

‘మహర్షి’ సినిమాలో నరేశ్ పాత్ర ఆశయాన్ని నెరవేర్చడం కోసమే హీరో రంగంలోకి దిగుతాడు. అంతటి ప్రాధాన్యతను కలిగిన పాత్రను చేసిన నరేశ్ ఇప్పుడు ఒక సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు .. ఆ సినిమా పేరే ‘అహం బ్రహ్మాస్మి’. మంచు మనోజ్ ఈ సినిమాలో హీరో .. ఆయన తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.