తిరువూరు, కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపును కాంక్షిస్తూ మంగళవారం తిరువూరులో ప్రచారం నిర్వహించిన తిరువూరు నియోజకవర్గ జనసైనికులు. ముందుగా తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ మనుబోలు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం రాజుపేటలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటుచేసిన తిరువూరు మండల జనసైనికుల సమావేశంలో 61, 62, 63, బూత్ లకు జనసేన పార్టీ బూత్ కన్వీనర్లను నియమించినట్లు ఆయన తెలియజేశారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి ఆదేశానుసారం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని గెలిపించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క జనసైనికుడిపై ఉందని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కాబట్టి అలసత్వం తీసుకోకుండా ప్రతి ఒక్క జనసైనికుడు కూటమి అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని జన సైనికులకు ఆయన దేశాన్ని నిర్దేశం చేశారు. ఇదే సందర్భంలో జనసేన పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సొంగా సంజయ్, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య, వనపర్ల డేవిడ్ రాజు, ఏ కొండూరు మండల అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ అలవాల్ రమేష్ రెడ్డి, మోదుగ వెంకటేశ్వరరావు, మేకల జాన్, తదితర తెలుగుదేశం నాయకులతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం గురించి చర్చించడం జరిగిందని ఆయన తెలియజేశారు.. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి గెలుపును కాంక్షిస్తూ తిరువూరు టౌన్ లోని, నారాయణ టెక్నో స్కూలు, డ్రీమ్ ఇండియా హైస్కూల్, నాగార్జున జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రముఖ వ్యాపార కూడలిలో ముత్తూట్ ఫైనాన్స్, జై బావి సెంటర్లో ప్రచారం నిర్వహించినట్లు ఈ కార్యక్రమంలో ఆయా కళాశాలల, పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బంది తమ యొక్క సమస్యలను కూటమి నాయకుల దృష్టికి తీసుకు వెళ్లవలసిందిగా తన దృష్టికి తీసుకు వచ్చినట్లు శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తిరువూరు టౌన్ నాయకులు లింగినేని సుధాకర్, పసుపులేటి రవీంద్ర, బత్తుల వెంకటేశ్వరరావు, రామిశెట్టి జగన్, బండారి తరుణ్, ఉయ్యూరు శరత్, ఉయ్యూరు మీనా కుమారి, ఆరేపల్లి నవీన్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment