కొవ్వూరు టౌన్ లో కూటమి నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

కొవ్వూరు నియోజకవర్గం, కొవ్వూరు పట్టణంలోని మూడవ వార్డు మరియు నాల్గవ వార్డుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ క్యాంపియన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి పట్టభద్రుల ఎం.ఎల్.సి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంని పరిచయం చేస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, మెగా డిఎస్సీ, ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షన్స్ ఇంకా మన ప్రభుత్వం చేపట్టిన మరియు చేపట్టబోతున్న అన్ని పధకాల గురించి వివరిస్తూ తమ ప్రాధాన్యత ఓటు బ్యాలెట్ లో రాజశేఖరం పేరు ఎదురుగా 1 అంకెను మాత్రమే వేయమని ప్రతి ఓటర్ కి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కొవ్వూరు టౌన్ 4వార్డ్ ఇంచార్జ్ బొంత కిషోర్, తెలుగుదేశం పార్టీ కొవ్వూరు టౌన్ 3వార్డ్ ఇంచార్జ్ కొక్కిరపాటి వెంకటేష్ (లాఠీ), మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ పెనుమాక జయరాజ్, జనసేన పార్టీ కొవ్వూరు టౌన్ నాయకులు పోలిశెట్టి శివ మరియు కూటమి అభ్యర్థులు కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు

Share this content:

Post Comment