ఉత్తరాంద్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు కూటమి బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు వేసి ఉపాధ్యాయ నాయకుడిని శాసన మండలికి పంపాలని ఉపాధ్యాయులు, ఉద్యోగులను కోరిన జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలలో కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్. పాలకొండ నియోజకవర్గ జనసేన శాసనసభ్యులు వారి కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో శాసన సభ్యులకు కూడా చట్టసభలలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆయన అన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో శాసన మండలిలో అనుభవజ్ఞ్యులైన పాకాలపాటి రఘువర్మకి మరొక్కసారి అవకాశం కల్పిస్తే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతుక అవుతారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధిని చూసి రఘువర్మ గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యాలని పేరు పేరునా ఉపాధ్యాయులను కోరిన జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్. ఈ కార్యక్రమంలో గిరిజన సహకార సంఘ స్టేట్ డైరెక్టర్ నిమ్మల నిబ్రం, తూర్పు కాపు స్టేట్ డైరెక్టర్ టంకాల దుర్గారావు, తోటపల్లి ప్రాజెక్ట్ చైర్మన్ ప్రతినిధి పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు, పాలకొండ టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంట సంతోష్, మాజీ హాస్పిటల్ కమిటీ చైర్మన్ వెన్నపు శ్రీను, జనసేన భామిని మండల పార్టీ అధ్యక్షులు రుంకు కిరణ్ మరియు వివిధ హోదాలో ఉన్న కూటమి నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment