పేద ప్రజల సంక్షేమానికి కూటమి కృషి

  • టిడ్కో గృహ సముదాలపై ప్రత్యేక దృష్టి
  • స్వచ్ఛభారత్ నిర్వహించిన జనసేన పార్టీ నేత నూనె మల్లికార్జున యాదవ్

నెల్లూరు, పేద ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జనసేన పార్టీ సీనియర్ నేత, కోర్ కమిటీ సభ్యులు నూనె మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు. టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచన మేరకు శనివారం స్థానిక వెంకటేశ్వరపురంలోని టిడ్కో గృహాల వద్ద స్వచ్ఛభారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా నూనె మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా వేములపాటి అజయ్ కుమార్ రాష్ట్రమంతా పర్యటించి అసంపూర్తిగా ఉన్న టిడ్కో గృహాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిని సరి చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జగనన్న కాలనీల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. పార్టీలు కులాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదు అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని మల్లికార్జున యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుందర్ రామిరెడ్డి, గునుకుల కిషోర్, పవన్, మధు, పోలయ్య, మనోజ్, రాజేష్, తాళ్లూరి వెంకట్, శ్రీకాంత్, హేమచంద్ర, వరలక్ష్మి, ప్రసన్న మరియు జనసేన నాయకులు వీరమహిళలు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-04-05-at-7.18.51-PM-1-1024x683 పేద ప్రజల సంక్షేమానికి కూటమి కృషి

Share this content:

Post Comment