హిందూ స్మశానవాటికకు స్థలాన్ని కేటాయించండి జనసేన వినతి

కదిరి, లక్షకు పైగా ఉన్నటువంటి కదిరి పట్టణ జనాభాలో హిందువులకు ఒక నిర్దిష్టమైన స్మశాన వాటికకు స్థలం కేటాయించండి అంటూ కదిరి జనసేన పార్టీ తరపున మూడు సార్లు కదిరి ఎమ్మార్వోకి వినతులు అందించడం జరిగింది. అయినా అధికారులు నిర్లక్ష్యంగా కాలయాపన చేస్తున్నారు. దీని కారణంగా హిందువులు ఎవరైనా చనిపోతే శవాలను రోడ్లకు ఇరువైపులా, కాలువల ప్రక్కన పూడ్చాల్సిన దారుణమైన పరిస్థితి వస్తోందని కదిరి పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కదిరి నియోజకవర్గ ఇంచార్జి భైరవ ప్రసాద్ తెలిపారు. ఇదే అంశాన్ని 2019 సంవత్సరం నుంచి జనసేన పార్టీ తరపున పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాము అయినా ప్రయోజనం లేకపోయింది. ఇదే అంశాన్ని మరొక్కసారి కదిరి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ (ఆర్.డి.ఓ)కి కదిరి జనసేన పార్టీ తరపున ఒక వినతిపత్రం అందించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే ఈ అంశం మీద ఆలోచన చేసి కదిరి పట్టణానికి 5 కిలోమీటర్ల పరిధిలో హిందువులకు ఒక స్మశాన వాటికకు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కాయల చలపతి, లీగల్ సెల్ కూగటం రవీంద్ర, జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, వానిల్లి అంజిబాబు, గంగాధర్, గంగరాజు, చంద్రశేఖర్, ఆదిశేషు, రఘునాథ్, గుంత ప్రతాప్, తదితర జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.