‘శాకుంతలం’ సినిమాతో అల్లు అర్జున్ కుమార్తె వెండితెర ఎంట్రీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కుమార్తె అల్లు అర్హ, సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం చిత్రంలో ప్రిన్స్ భరత గా నటిస్తుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఈరోజు (గురువారం) అర్హ సెట్స్ లో జాయిన్ అయింది. అర్హ పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ 10 రోజుల్లో పూర్తి చేస్తారని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో అల్లు అర్హ తన ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేష్టలతో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. అల్లు స్నేహా రెడ్డి సోషల్ మీడియా మధ్యమాలలో ఎప్పటికప్పుడు అర్హకు సంబంధించి ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. దీంతో నాలుగేళ్ల వయసులోనే తన క్యూట్ నెస్ తో అల్లు అర్హ పాపులారిటీ సంపాదించుకుంది.

మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల-దుష్యంత మహారాజు ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో శకుంతల గా సమంత అక్కినేని, దుష్యంత మహారాజు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు.