అల్లు అర్జున్‌ కొత్త మూవీ థియేటర్‌ ‘AAA’ సినిమాస్‌

సినిమా ప్రేమికులకు అమీర్ పేట సత్యం థియేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాదు నడిబొడ్డున ఉండే ఈ థియేటర్ స్థానంలో ఇప్పుడు కొత్త థియేటర్ నిర్మితమవుతోంది. కొత్త హాల్ యజమాని ఎవరో కాదు… టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా థియేటర్ పేరు ‘AAA సినిమాస్’. ఇది ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మితమవుతోంది. అందుకే అల్లు అర్జున్ పేరు కలిసొచ్చేలా ‘ట్రిపుల్ ఏ’గా నామకరణం చేశారు.

ఇవాళ అమీర్ పేటలో పూజా కార్యక్రమాలు జరగ్గా, అల్లు అర్జున్, సునీల్ నారంగ్, నారాయణ్ దాస్ నారంగ్ తదితరులు హాజరయ్యారు. కాగా, బన్నీ సినిమా థియటర్ కు సంబంధించి ట్రిపుల్ ఏ లోగో కూడా డిజైన్ చేశారు.

టాలీవుడ్ లో ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు, యువ హీరో విజయ్ దేవరకొండ కూడా సొంత థియేటర్లను కలిగివుండడం తెలిసిందే. ఏఎంబీ సినిమాస్ పేరిట మహేశ్ బాబు గచ్చిబౌలిలో సినిమా థియేటర్ నిర్మించగా, విజయ్ దేవరకొండ ఏవీడీ సినిమాస్ పేరుతో మహబూబ్ నగర్ లో సినిమా థియేటర్ నిర్మించారు.