సోషల్ మీడియాకు అల్లు శిరీష్ దూరం

టాలీవుడ్‌ హీరో.. అల్లు శిరీష్‌ తాజాగా సోషల్‌మీడియాకు గుడ్‌ బై చెబుతున్నట్టుగా ప్రకటించాడు. ‘ఈ సంవత్సరం నవంబర్‌ 11వ తేదీ నాకు చాలా స్పెషల్‌ డే. నా వృత్తి జీవితంలో మర్చిపోలేని రోజు. విషయం ఏంటనేది త్వరలో నేనే వెల్లడిస్తా అంతవరకూ కొన్ని కారణాల వల్ల సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటాను’ అని శిరీష్‌ ట్వీట్‌లో పేర్కొన్నాడు. గత కొన్నిరోజులుగా శిరీష్‌ సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ… ఇప్పుడు సడెన్‌గా గుడ్‌బై చెప్పడంతో పెళ్లి కుదిరిందా? అంటూ శిరీష్‌ని నెటిజన్లు రకరకాల ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. దాంతో ‘నేను వృత్తిపరంగానే దూరమవుతున్నాను. ఈరోజు వృత్తిపరంగా నాకు స్పెషల్‌ డే అని మరీ మరీ చెప్పాను సామీ’ అంటూ శిరీష్‌ రిప్లై ఇచ్చాడు. ఒకవేళ పెళ్లి కుదిరితే.. సోషల్‌మీడియా ద్వారా అభిమానులందరికీ తెలియజేస్తానని అన్నారు.
ఇక శిరీష్‌ ప్రస్తుతం ‘ప్రేమ కాదంట’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శిరీష్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. ఈ చిత్రానికి రాకేష్‌ శశి దర్శకత్వం వహిస్తుండగా.. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌- శ్రీ తిరుమల ప్రొడక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.