8 వసంతాల ‘ జులాయి ‘: అల్లు అర్జున్ ట్వీట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘జులాయి’  చిత్రం మంచి  విజయం సాధించి బన్ని కెరీర్ లో ఒకటైన బ్లాక్‌బస్టర్‌గా నిలచిన విషయం అందరికీ తెలిసిoదే. అయితే ఈ చిత్రం 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా కథానాయకుడు ట్విట్టర్ లో సంతోషం వ్యక్తం చేశారు. జులాయి ఒక మెమొరబుల్ హిట్ అని మరియు హిట్ అందించిన డైరెక్టర్ త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, ప్రొడ్యూసర్స్ రాధా కృష్ణ మరియు దానయ్యలతో పాటు చిత్ర యూనిట్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేశారు.