అల్లుడు అదుర్స్’ టాక్ అదుర్స్

అల్లుడు శ్రీను చిత్రంతో ఇండస్ట్రీ కి హీరోగా పరిచమైన బెల్లం కొండ శ్రీనివాస్.. ఇప్పుడు అల్లుడు అదుర్స్ అంటూ సంక్రాంతి బరిలోకి వచ్చాడు. ‘కందిరీగ‌’, ‘ర‌భ‌స’, ‘హైప‌ర్‌’ వంటి కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కి పాజిటివ్ టాక్ వస్తుంది.

సంక్రాంతి అల్లుడి కామెడీ కూడా బాగానే ఉందని అంటున్నారు. స్క్రిప్ట్ చాలా బాగుందని, క్లాసీ వేలో ఆ స్క్రిప్ట్ ప్రెజెంట్ చేశారని తెలుస్తోంది. కాకపోతే ఈ అల్లుడి కథను దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కాస్త స్లోగా నేరేట్ చేశాడని ట్వీట్స్ వస్తున్నాయి. ఇకపోతే ఈ అల్లుడు అదుర్స్ మూవీ బెల్లంకొండ సురేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని కొంతమంది అంటున్నారు. దేవీ శ్రీ బాణీలు మరోసారి మ్యాజిక్ చేస్తూ మ్యూజిక్ ప్రియులను ఆకర్షించాయని చెపుతున్నారు.