*జనసేన నేతలు నివాళులు
శ్రీకాకుళం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 124వ జయంతిని పురస్కరించుకొని శ్రీకాకుళం పట్టణంలోని పి.ఎన్ కాలనీ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన విగ్రహానికి జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ శుక్రవారం పూలదండలు వేసి హృదయపూర్వకంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “బ్రిటిష్ పాలకులకు ఎదురెళ్లి మన్యం ప్రజల హక్కుల కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు గారి పోరాట తత్వం భావి తరాలకు చాటిచెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతి పౌరుషానికి ప్రతీక అయిన అల్లూరి స్ఫూర్తిని యువతలో నాటాలని ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దంతులూరి రమేష్ రాజు, నల్లాన మధు, జిల్లా కార్యదర్శి కొండా ఉదయ్ శంకర్, సంయుక్త కార్యదర్శులు గురుప్రసాద్ గౌడ్, కొండ్రా వరప్రసాద్, ఎం.డి రఫీ, పాండ్రంకి రాజేష్ నాయుడు, వాడవలస సురేష్ కుమార్, పెద్దపాడు శంకర్, ముంగి జగదీశ్, గుమ్మడి శాంతారావు, పైడి మురళి, పల్లె శ్రీనివాస్, కాకర్ల ప్రదీప్, తురుపూరి నవీన్, బగ్గు అప్పలరాజు, ధనుంజయ, మణి, పైల శ్రీను, గొట్టా సురేష్, మరియు జనసేన జిల్లా వీరమహిళలు బొడ్డు మోహన్ లక్ష్మి, గొర్లె అనురాధ, కలగ లక్ష్మి, అనాపు లత, ఎం లక్ష్మి, డోల లక్ష్మి, ఉప్పాడ రాజేశ్వరి, పప్పు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై దేశభక్తి జ్యోతిని మరోసారి వెలిగించారు.
Share this content:
Post Comment