గిరిజన హక్కుల కోసం పోరాడిన నాయకుడు అల్లూరి

*మంత్రి సంధ్యా రాణి

సాలూరు, అల్లూరి సీతారామరాజు మహనీయులు అలాంటి వారి చరిత్ర ఇప్పుడున్న యువతీ, యువకులు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొనియాడారు. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా మంత్రి సంధ్యారాణి నివాసం వద్ద కార్యకర్తలతో కలిసి వారి చిత్రపటానికి పూలమాలవేసి స్మరించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ కాలంలో పోరాడిన మహానాయకుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల చరిత్ర ఇప్పుడున్న కాలంలో యువతీ యువకులు పెద్దలు నాయకులు తెలియజేయవలసిన అవసరం ఎంతో ఉందని వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని,కుటుంబాన్ని గౌరవించే విధంగా నడిపిస్తూ నడుచుకోవాలని అవగాహన చేశారు. అలాగే అల్లూరి సీతారామ రాజు భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో చిరస్మరణీయులు. వారి త్యాగాలు, ధైర్యసాహసాలు, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన ఆయన మార్గం నేటి తరం నాయకులకు దిక్సూచిగా ఉండాలి అని చెప్పారు.

Share this content:

Post Comment