అల్లూరి జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం

*ఏకేయూలో ఘనంగా అల్లూరి సీతా రామరాజు జయంతి వేడుకలు..

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచి, ఎందరో స్వాత్రంత్రోద్యమ నాయకులకు ఆదర్శంగా నిలిచిన స్వర్గీయ అల్లూరి సీతా రామరాజు జీవితం నేటి కాలంలో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా యువతకి ఎంతగానో ఆదర్శప్రాయమని, స్ఫూర్తి దాయకమని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి అన్నారు. ఆనాటి కాలంలో తెల్ల దొరల గుండెల్లో నిద్రించిన మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజు 128వ జయంతి కార్యక్రమాన్ని పురష్కరించుకొని శుక్రవారం ఆంధ్ర కేసరి యూనివర్సిటీ కళాశాల ప్రాంగణంలో స్వర్గీయ అల్లూరి చిత్ర పటానికి వి.సి ప్రొఫెసర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.రాజ మోహన్ రావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్. నిర్మలా మణి, సిడిసి డీన్ ప్రొఫెసర్ జి. సోమ శేఖర, ఎన్.ఎస్.ఎస్. కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమమునకు ఏ. కే. యూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. రాజ మెహన్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విసి ప్రొఫెసర్ మూర్తి యూనివర్సిటీ ఆచార్యులు, సహా ఆచార్యులు, సిబ్బంది, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో బ్రిటిష్ పాలకుల పట్ల సింహస్వప్నంగా నిలిచిన గొప్ప పోరాట యోధుడు అల్లూరి సీతా రామరాజు అని, అటువంటి పోరాట యోధుని ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరం పునరంకితం కావాలని ఆయన ఆకాంక్షించారు. అదే సమయంలో నేటి యువత కూడా అల్లూరి సీతా రామరాజు జీవిత చరిత్రను పూర్తి స్థాయిలో తెలుసుకొని లక్ష్య సాధన కోసం ఆయన చేపట్టిన విధానాలను విద్యాభివృద్ధి కోసం వినియోగించు కోవాలని సూచించారు. అనంతరం ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఎన్.ఎస్.ఎస్ విభాగం కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ మోహన్ రావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిర్మలా మణి, సిడిసి డీన్ ప్రొఫెసర్ సోమ శేఖర లతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-07-04-at-4.14.18-PM-1024x768 అల్లూరి జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం

Share this content:

Post Comment