ఆపదలో ఉన్నవారికి అండగా ఆమదాలవలస జనసేన నాయకులు

ఆమదాలవలస: బూర్జ మండలం, సింగన్న పాలెం గ్రామానికి చెందిన కొల్ల అప్పలనరసమ్మ ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఆమదాలవలస నియోజకవర్గం జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర (మండల అధ్యక్షులు), కొల్ల జయరామ్, ఎంపిటిసి విక్రమ్, తులగాపు మౌలీ, కిల్లానా నరేష్ తులగాపు తిరుపతి, గేదెల వాసు, మహేష్ మరియు జనసైనికులు, ఊరి పెద్దలు, యువత సహకారంతో తమవంతు సహాయంగా రూ.5000 వేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. పార్టీ పరంగా ఇంటి నిర్మాణానికి కృషి చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.