అంగన్వాడీ వర్కర్స్ దీక్షకు సంఘీభావం తెలిపిన అమలాపురం జనసేన

అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఏపి అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ రిలే నిరాహారదీక్షలకు సంఘీభావం తెలియజేసిన అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి డి.ఎం.ఆర్ శేఖర్ మాట్లాడుతూ అంగన్వాడీ మహిళలకు తెలంగాణలో ఇస్తున్నట్టు అధికారంలోకి రాగానే 15 వేల రూపాయలకు పెంచుతాం అని ఎన్నికల ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నేరవెర్చాలని లేని పక్షంలో జనసేన పార్టీ తరపున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు లింగోలు పండు, కంచిపల్లి అబ్బులు, ఇసుకపట్ల రఘుబాబు, ఏడిద శ్రీను, పడాల నానాజీ, పోలిశెట్టి బాబులు, ఆర్.డి.ఎస్ ప్రసాద్, కొప్పుల నాగ మానస, తిక్క సరస్వతి, చేట్లా మంగతాయారు, కర్రి లక్ష్మి దుర్గ, నల్లా వెంకటేశ్వరరావు, అల్లాడ రవి, కంకిపాటి గోపి, సాధనాల మురళీ, డి.ఎస్.ఎన్ కుమార్, గంధం శ్రీనివాస్, గట్టేం వీరు, పాలురి నారాయణ స్వామి, మోటురి సూర్య కిరణ్, నల్లా సత్తిబాబు, పోలిశెట్టి దుర్గారావు, నల్లా దుర్గారావు, నల్లా బ్రహ్మాజీ, కోలా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.