ఒకే తాటిపై అమలాపురం జనసేన

అమలాపురం: రాబోయే ఎన్నికల్లో పొత్తులో భాగంగా అమలాపురం అసెంబ్లీ టికెట్ తెలుగుదేశానికి కేటాయించడంతో జనసేన పార్టీ క్యాడర్లో నైరాస్యం నెలకొంది. ఇటీవల పార్టీ ఇంచార్జి శెట్టిబత్తుల రాజాబాబు వైసీపీ జిల్లా కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డిని కలవడంతో నియోజకవర్గ జనసేనలో మరింత నిరుత్సాహం ఏర్పడింది. ఈ తరుణంలో పార్టీలోని పెద్దలు గత నాలుగు రోజులుగా పార్టీలో ఉన్న రెండు వర్గాలను సమన్వయ పరచడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఎవరు ఎన్ని వర్గాలుగా ఉన్నా అందరూ పని చేసింది పార్టీ కోసమే అని ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని ఇకపై కలిసి పనిచేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ఇరు వర్గాలు గురువారం అమలాపురం నియోజకవర్గం వేమవరంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో రానున్న కాలంలో అమలాపురంలో జనసేన పార్టీని ఎలా నడిపించుకోవాలి అనే దానితో పాటు, పొత్తులో భాగంగా మిత్ర పార్టీలైన తెలుగుదేశం, బిజెపిల వద్ద అమలాపురం జనసేన పార్టీ కార్యకర్తల భవిష్యత్తుకై అడగాల్సిన హామీలపై చర్చించారు. వెంటనే ఇక్కడి పరిస్థితులను పార్టీ అధిష్టానానికి తెలియచేసి, తదుపరి ఉమ్మడి అభ్యర్థి యొక్క బలోపేతంపైనా, ఉమ్మడి కార్యాచరణ పైనా మరోసారి సమావేశమై ముందుకు సాగుదామని ఈ సమావేశం తీర్మానం చేసింది. ఈ కార్యక్రమంలో పెద్దలు సలాది వెంకట రమణ, నల్లా శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల నాగ సతీష్, సీనియర్ నాయకులు కంచిపల్లి అబ్బులు, మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, ఇసుక పట్ల రఘు బాబు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, పడాల శ్రీదేవి నానాజీ, లింగోలు పండు, ఆర్.డి.యస్.ప్రసాద్, ఆకుల సూర్యనారాయణ మూర్తి, నల్లా అజయ్, మొయిల శివ, పోలిశెట్టి బాబులు, డి ఎస్ ఎన్ కుమార్, అడపా ప్రకాష్, హనుమాన్ బుజ్జి, బట్టు పండు, చేట్ల మంగతాయారు, తిక్కా సరస్వతి, కర్రి లక్ష్మి దుర్గ, షరీఫ్, కరీం, షఫీ ఉల్లా, మున్వర్, బాషా, జనసేన ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, మెంబర్లు మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు.