అమలాపురం విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ లో శెట్టిబత్తుల రాజబాబు

అమలాపురం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణవ్యతిరేకిస్తూ పార్లమెంట్లో గళమెత్తేలా ఎంపీ శ్రీమతి చింతా అనూరాధపై ఒత్తిడి తెచ్చేందుకు అమలాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీ శెట్టిబత్తుల రాజబాబు అమలాపురం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లొ విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లవరం మండలం అల్లవరం సెంటర్ లో, ఉప్పలగుప్తం మండలం కూనవరం మరియు భీమనపల్లి గ్రామాల్లో ప్లకార్డ్స్ తో కూడిన డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు.