వెంకటమ్మకు పింఛన్ నిలిపివేడాన్ని ఖండించిన అమర్ కార్తికేయ

కదిరి: వెంకటమ్మ, వయసు (94) గందోడివారిపల్లి, తనకల్లు మండలం, 1928 సం.. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల వరకు పింఛన్ వచ్చే ఆమెకు గత 10 నెలల నుండి రావడం లేదు. అధికారులకు అన్నిరకాలుగా అర్జీలు అందించారు. కారణం ఆమెకు చేతి వేళ్ళు, కళ్ళు ఈకె వైసీ కావడం లేదు అంటున్నారు. ఈ వయసులో వాళ్లకు బ్లడ్ సర్కులేషన్ ఉండదు, వేలి ముద్రలు పడవు అని అదే కారణం చూపించి పింఛన్లు తీసేసి వారికి ఆ సమస్య పరిష్కార మార్గం లేకుండా చేస్తున్నారు. గ్రామ సెక్రటరీని కూడా అక్కడికి రప్పించి విషయం తెలియజేస్తే మేము చేయగలిగింది ఏమి లేదు.. కలెక్టర్ కి విషయం తెలియజేయండి అన్నారు. ఈ పెద్దామే కోసం జనసేన పార్టీ తరపున కలెక్టర్ వరకూ వెళ్లినా సమస్య పరిష్కారం అవుతుందో లేదో కూడా తెలియదు. ఇలాంటి సమస్యలే ఎన్నో ఉన్నాయి వారందరూ అలా వెళ్లగలరా…? కేవలం పింఛన్ పై మాత్రమే ఆధారపడి బ్రతికే ఇంత వయసుమళ్ళిన వారికి ఇలాంటి కారణాలతో పింఛన్ తీసివేయడాన్ని జనసేన పార్టీ తరుపున ఖండిస్తున్నాము. ఆమెకు పింఛన్ వచ్చేలా మా వంతు ప్రయత్నం కూడా చేస్తాము అని కదిరి నియోజకవర్గం, జనసేన పార్టీ ఎంపీటీసీ అమర్ కార్తికేయ అన్నారు.