అమరావతి పునఃశంకుస్థాపన విజయవంతం

*ప్రజల ఆశలకు నూతన ఆరంభం
*జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను

విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పునః శంకుస్థాపన కార్యక్రమం అత్యంత ఘనంగా, విజయవంతంగా జరగడం గర్వకారణమని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ప్రసంగాలు ప్రజల్లో విశ్వాసం, ఉత్సాహాన్ని నింపినాయని పేర్కొన్నారు. అమరావతి కోసం భూములు సమర్పించిన రైతుల త్యాగాలు రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని, వారి త్యాగాలు శాశ్వతంగా గుర్తించబడుతున్నాయని అభిప్రాయపడ్డారు. అమరావతి ప్రజల రాజధానిగా ప్రజల మన్నన పొందిన ప్రాంతమని, అది రాష్ట్ర అభివృద్ధికి సంకేతంగా మారిందని ఆయన తెలిపారు. ఈ మహాకార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చినందుకు అభినందనలు తెలియజేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని అధికారంలోకి వచ్చిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాజధాని అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని వివరించారు. గ్రామస్థాయి వరకు అభివృద్ధిని విస్తరించేలా రహదారుల నిర్మాణం, ఉపాధి హామీ పథకాల అమలులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నుండి నిధులును సమర్థవంతంగా రాబట్టి, వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగిస్తున్న ఘనత కూడా పవన్ కళ్యాణ్ గారిదేనని సామినేని ఉదయభాను పేర్కొన్నారు.

Share this content:

Post Comment