రాజకీయ భవిష్యత్తు కోసం నీచ రాజకీయాలు చేస్తున్న అంబటి: గాదె

గుంటూరు: జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ వైసీపీ ప్రభుత్వం వారు నీచ రాజకీయాలు చేస్తున్నారు. రైతుల సాగు నీరు లేక ఇబ్బంది పడుతుంటే కొత్త రాజకీయా నాటకానికి తెరతీసారు అంబటి. ఆయనపై దాడి జరిగితే కాపు కులం మొత్తం పోరాటం చేయాలంటూ మీడియా ముందు సొకండాలు పెడుతున్నాడు అంబటి. మీ పార్టీ మంత్రి పక్క రాష్ట్రంలో తన్నులు తింటే పవన్ ఎందుకు స్పందించాలి. మీ ప్రభుత్వంకి యాత్రలు చెయ్యడం మామూలే కదా కాపుల సంఘీ భావ యాత్ర అంటూ బస్సుతో వస్తే సరిపోయేది కదా. తన పక్క జిల్లాలో రైలు ప్రమాదం జరిగితే ఆ ఘటన పట్టించుకోకుండా అంబటి పరామర్శ కు వచ్చారు మంత్రి ఆమర్ నాద్. ముద్రగడను హత్య చేసేందుకు ట్రైన్ వద్దకు తీసుకు వెళ్ళింది మీరు కదా. వంగవీటి మోహన రంగా గారిని చంపిన వ్యక్తి కుటుంబానికి ఎమ్మెల్యే సీటు ఇచ్చింది మీ ప్రభుత్వమే కదా. రంగా గార్ని రౌడీతో పోల్చిన గౌతమ్ రెడ్డి వైసీపీలో ఉన్నత పదవులు ఇచ్చింది మీ ప్రభుత్వమే కదా. మీకు కులం మీద ప్రేమ లేదు కానీ కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ వ్యభిచారం చేస్తుంది ఈ వైసీపీ కాపు ఎమ్మెల్యే, మంత్రులే కదా మీరు వైసీపీ బానిసలు మాత్రమే. కులాల మద్య కుంపటి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు కులం కనపడలేదా. ఒక రాష్ట్ర మంత్రి మరో రాష్ట్రంలో తన్నులు తిన్న ఘటన ‌ఇంతకు ముందు లేదు. చొక్కాపై కూడా జగన్ ఫొటో వేసుకున్న చరిత్ర అంబటిది. పిచ్చి కుక్కను తంతే ఎవ్వరూ స్పందించారు. అంబటి తన్నులు తిన్న సంఘటనికి కులానికి సంభందం ఏమిటి. విజయవాడ డ్రైవర్ హారన్ కొట్టాడని చావ చితక కొట్టారు మీ సైకోలు. జనసేన, టీడీపీ పొత్తును విడదీయాలను వైసీపీ ప్రయత్నిస్తుందని గాదె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శిఖా బాలు, మధు లాల్, హుస్సేన్ పాల్గొన్నారు.