గుంటూరు, తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎక్కడా ఎలాంటి మచ్చ లేని జనసేన నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ని విమర్శించే నైతిక అర్హత అధికారాన్ని అడ్డం పెట్టుకొని పేదల సహాయ నిధిలో సైతం అవినీతికి పాల్పడి శవాలపై పేలాలు ఏరుకున్న వైసీపీ నేత అంబటి రాంబాబుకి లేదని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. నాదెండ్ల మనోహర్ బియ్యం దొంగ అంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై అయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాధనాన్ని దోచుకున్న గజ దొంగలెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసంటూ వ్యాఖ్యానిచారు. జగన్ విసిరే అవినీతి మెతుకులకు ఆశపడే వైసీపీ నేతలు జనసేనపై అసందర్భ విమర్శలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. శుక్రవారం అయన పార్టీ కార్యాలయంలో జనసేన శ్రేణులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు పేదల బియ్యాన్ని పంది కొక్కులా తిన్న వైసీపీ నేతలకు ఇంకా కడుపు నిండలేదని మండిపడ్డారు. పౌర సరఫరాల శాఖా మంత్రిగా నాదెండ్ల మనోహర్ పదవీ బాధ్యతలు స్వీకరించాక బియ్యం మాఫియాపై ఉక్కుపాదం మోపారన్నారు. దీంతో వైసీపీ దొంగల ముఠా ఉక్కిరిబిక్కిరి అవుతూ నాదెండ్లపై అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. నాదెండ్ల మనోహర్ నిజాయితీ, నిబద్దతకు, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. అంబటి నీచ చరిత్ర తెలిసిన ప్రజలు అయన వ్యాఖ్యలను చూసి చీదరించుకుంటున్నారని దుయ్యబట్టారు. జనసేన నేతలు మామిడి రామారావు, దాసరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలు దిమ్మదిరిగే తీర్పు ఇచ్చి ఛీ కొట్టినా జగన్ రెడ్డికి కానీ ఆ పార్టీ నేతలకు కానీ ఇంకా సిగ్గురాకపోవటం శోచనీయమన్నారు. తమ ఉనికిని కాపాడుకునేందుకే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై, జనసేన నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం చేశారు. ప్రజలు వైసీపీని ఇక క్షమించరని భవిష్యత్ లో రాష్ట్రంలో వైసీపీ ఉనికే ఉండదని జోస్యం చెప్పారు. విలేకరుల సమావేశంలో రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్, మెహబూబ్ బాషా, కోలా అంజి, పసుపులేటి నరసింహారావు, వడ్డె సుబ్బారావు, నండూరి స్వామి, తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment