అంబటి రాజకీయ చరిత్ర హీనుడిగా నిలిచిపోతాడు: నేరేళ్ళ సురేష్

  • జగన్ రెడ్డి కాళ్ళ దగ్గర వ్యక్తిత్వాన్ని తాకట్టుపెట్టి బానిసలా బ్రతుకుతున్నాడు
  • జలవనరుల శాఖని జల్సా వనరుల శాఖగా మార్చాడు
  • పవన్ కళ్యాణ్ ని తిట్టే శాఖకు వైసీపీ నేతలందరూ మంత్రులే
  • అంబటికి ఎందుకు ఓటేసామా అని సత్తెనపల్లి ప్రజలు బాధపడని క్షణం లేదు
  • పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు ఒక వైసీపీ నేత సమాధానం చెప్పలేదు
  • సినిమాలపై పెట్టిన శ్రద్ధ పోలవరంపై పెడితే బాగుంటుంది
  • జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: తన వికృతమైన పోకడలతో రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి అంబటి రాంబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోనున్నాడని జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాపై ఇష్టానురీతిగా మాట్లాడటమే కాకుండా తాను కూడా పవన్ కళ్యాణ్ పై వివిధ రకాల పేర్లతో సినిమాలు తీస్తానంటూ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడటంపై జనసేన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 22 వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీనివాసరావుతోటలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో నవ చిత్రాల పేటిక పేరుతో తొమ్మిది చిత్రాల పేర్లను విడుదల చేసారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ రేపల్లేలో తంతే సత్తెనపల్లికి వచ్చిన రాంబాబు మాటలు విని వైసీపీకి ఓటేందుకు వేశామా అని సత్తెనపల్లి వాసులు బాధపడని క్షణం లేదన్నారు. జలవనరుల శాఖని జల్సా వనరుల శాఖగా మార్చి పరిపాలనను గాలి కొదిలేసి పవన్ కళ్యాణ్ పై గాలి కూతలు కూస్తున్నాడని మండిపడ్డారు. అంబటికి పోలవరం గురించి తెలియదు ప్రాజెక్టుల గురించి తెలియదు కానీ సినిమా కలెక్షన్స్ గురించి మాత్రం తెలుసని ఎద్దేవా చేశారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ బ్రో సినిమాలోని పృద్విరాజ్ పాత్రని తనకు తాను ఆవహించుకొని తాను ఎంత పనికిమాలిన వాడినో మరోసారి అంబటి ప్రత్యక్షంగా ప్రజలకు తెలియచేసారని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు అంబటిని వన్ అవర్ స్టార్ అనుకున్నామని తీరా రెండు నిమిషాలకే పరిమితమై పోయాడన్నారు. పత్రికా సమావేశంలో పోలవరం గురించి మాట్లాడతాడని ప్రజలంతా ఎదురుచూస్తుంటే బ్రో సినిమా కలెక్షన్స్ చెప్పటంతో అంబటి తీరును ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని దుయ్యబట్టారు. సినిమాలపై పెట్టిన శ్రద్ధలో పది శాతం పోలవరంపై పెట్టి ఉంటే బాగుండేదన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడ నుంచున్నా అంబటి రాంబాబు గెలవడం కల్ల అని ఆళ్ళ హరి అన్నారు. అనంతరం మాటల్లోనే గంట – చేతల్లో చవట పేరుకే మంత్రి – పాలనలో కంత్రీ రూపం మారెన్.. కామం కామన్.. చెప్పేవి వై చీ పి నీతులు – ఏరుకునేవి శవాలపై పేలాలు.. బుద్ధి బానిస అయింది – కులం వెలేసింది. రేపల్లె తన్నింది – సత్తెనపల్లి పొమ్మంటుంది.శాఖలో పట్టు లేదు – కమీషన్లలో విడుపు లేదు. నోరంతా అశుద్ధపు కంపు – కావాలి సంస్కారవంతమైన XXX సబ్బు అనే సినిమా పేర్లతో పోస్టర్లను విడుదల చేసారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక సంఘ నేత సోమి శంకరరావు, నగర కమిటీ నాయకులు చింతా రాజు, యడ్ల నాగమల్లేశ్వరరావు, బండారు రవీంద్ర, మెహబూబ్ బాషా, సోమి ఉదయ్, పులిగడ్డ గోపి, నర్సింహా, రామిశెట్టి శ్రీను, కొలసాని బాలకృష్ణ, నండూరి స్వామి, మిద్దె నాగరాజు, కోలా అంజి, పీ రమేష్, రఫీ, వడ్డె సుబ్బారావు, చిన్నా, ఫోటో బాలకృష్ణ, తాడికొండ శ్రీను, సెంట్రింగ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.