తాడేపల్లిగూడెం, 1వ వార్డులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134.జయంతి సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి బొలిశెట్టి శ్రీనివాస్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఆ ప్రాంతానికి చెందిన చిన్నారులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ముందుగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు క్యాంప్ ఆఫీసు నందు ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వారితో పాటుగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక వివక్షకు గురయిన అంబేద్కర్ నేడు దేశ ప్రజల ఆరాధ్యదైవంగా ఎదిగారని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి సందర్బంగా సోమవారం ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్య ద్వారా ఏదయినా సాధించగలమని అంబేద్కర్ నిరూపించారని, విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకో వాలని అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా వాక్ స్వాతంత్య్రం లభించిందని గత 5సంవత్సరాలు అరాచకంపై పోరాడ గలిగామని అన్నారు. దేశం ఎలా నడుచుకోవాలో నిర్దేశించారని, అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగ రచన చేసిన మహానుభావుడు అంబేద్కర్ అని ఘన నివాళులు అర్పించారు.దేశపౌరు లందరూ విద్యావంతులు కావాలన్న అంబేద్కర్ ఆశయ సాధన కు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తల్లి దీవెన పధకం ద్వారా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. దళితులకు కేటాయించిన ఎస్. సి.ఎస్.టి. సబ్ ప్లాన్ నిధులను మళ్ళించి జగన్ దళితుల కు తీరని అన్యాయం చేశారని అన్నారు. తమ ప్రభుత్వం వారికి న్యాయం జరిగేవిధంగా అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రతి ఏటా అంబేద్కర్ జయంతిని అందరం కలిసి ఒకే చోట ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశి, పెంటపాడు మండలం రూరల్ అధ్యక్షుడు పుల్లా బాబి, దళిత సంఘ నాయకులు చాపల రమేష్, పైబోయిన రఘు, పైబోయిన వెంకటరామయ్య, మైలవరపు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment