ఏలూరులో వీధి వీధి ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

  • 134 వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.

ఏలూరు, ప్రపంచ గొప్ప మేధావులలో ఒకరిగా, ప్రపంచానికే స్ఫూర్తిప్రదాతగా నిలిచిన డా.బి.ఆర్. అంబేడ్కర్ భారతీయునిగా జన్మించడం భారతీయులు చేసుకున్న అదృష్టమని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పేర్కొన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతిని పురస్కరించుకుని ఏలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు రాజ్యాంగం మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలి. ప్రజల్ని చైతన్య పరచాలి. ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహన పై మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే శక్తివంతమైన చైతన్యం అందించే దిశగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలను, ఆశయాలను దీనికి జోడించి రాబోయే తరానికి ఈ నవ సమాజ నిర్మాణం లో భాగంగా అందరం కూడా భాగస్వాములు కావాలని, అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందేవిధంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అంబేద్కర్ అందరివాడు. యుగ పురుషుడు. దేశంలోని సంపద, విజ్ఞానం, సామాజిక న్యాయం, అందరికీ సమానంగా అందాలని అంబేద్కర్ ప్రవచించిన ఆదేశిక సూత్రాలకు అనుగుణంగానే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను జనసేన పార్టీ తరుపున కూటమి ప్రభుత్వం తరఫున ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. అనంతరం 27 వ డివిజన్ చొదిమెళ్ళ గ్రామంలో, 3 వ డివిజన్ పరిధిలోని నవాబు పేట, మారుతి నగర్, వెన్నవల్లి వారి పేట, 13 వ డివిజన్ ఇందిరా కాలనీ, వంగాయగూడెం సెంటర్, కలెక్టర్ ఆఫీసులోని గోదావరి గ్రామీణ సమావేశ మందిరం, పాత బస్టాండ్ మరియు ఏలూరు ఆర్టీసీ బస్టాండ్ లో గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, అల్లు సాయి చరణ్, జనసేన రవి, ఇద్దుం చిరంజీవి, బెజవాడ నాగభూషణం, బండి రామకృష్ణ, వీర మహిళలు కొసనం ప్రమీల, కోలా సుజాత, యడ్లపల్లి మమతా, అంబేద్కర్ కమిటీ సభ్యులు పల్లి విజయ్, భూపతి ప్రసాద్, తోట రాజేష్, సానాసి వెంకట రమణ, తోట నాగరాజు, బి.అంజి, బి.రాము, కె.రాజేష్, బి.కాళీ, జె.అశోక్, బి.సత్తి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment