కర్నూలులో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు

భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బాధించబడ్డ, పీడించబడ్డ బలహీన వర్గాల ఆశాజ్యోతి, న్యాయ కోవిదులు, రాజకీయ నాయకులు, భారతరత్న బాబా సాహెబ్ బి.ఆర్. అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా, మంత్రాలయ నియోజకవర్గం టౌన్‌లో అంగరంగ వైభవంగా అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు జరిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి బోయ పోరాట కమిటీ అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మంత్రాలయ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బి. లక్ష్మణ్ గారు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ గారి ఆలోచన విధానాన్ని, ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అద్భుతమైన ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ గారి ఆశయాలను గొప్పగా గుర్తించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ ఇంచార్జి రాఘవేందర్ రెడ్డి, జిల్లా, నియోజకవర్గ దళిత నాయకులు జానయ్య, హనుమన్న, మాదిగ రత్నం, ముతురెడ్డి, రాంరెడ్డి, టిప్పు సుల్తాను, సురేష్ నాయుడు, ఈరన్న, ఙ్ఞానేష్, వరదరాజులు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మంచాల లక్ష్మీనారాయణ, బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు గుదిపే. సామేలు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిలలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంబేడ్కర్ గారి ఆశయాలను కొనసాగించడమే లక్ష్యంగా విజయవంతంగా నిర్వహించబడింది.

Share this content:

Post Comment