పెద్దాపురం మండలంలోని రాయ భూపాలపట్నం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భీమ్ రావు యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ తుమ్మల రామస్వామి బాబు హాజరయ్యారు. ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా భారత రాజ్యాంగం అమలులో ఉండటం గర్వకారణమని అన్నారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన అంబేద్కర్ గారు, సమానత్వానికి, న్యాయానికి ప్రాధాన్యతనిచ్చే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. నేడు ప్రతిఒక్కరూ ఒకే చట్టాన్ని అనుసరించి సమాన హక్కులు పొందడంలో ఆయనకు ఉన్న గొప్ప పాత్రను గుర్తు చేశారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడిగా అంబేద్కర్ గారు గుర్తింపుపొందారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.బి.పట్నం జనసేన నాయకులు నల్లల శ్రీను, పట్టా శ్రీను మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment