సర్వేపల్లిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు

*జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు నేతృత్వంలో వేడుకలు

సర్వేపల్లి నియోజకవర్గం: భారత రాజ్యాంగ నిర్మాత, పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గారి 135వ జయంతిని సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు నాయకత్వం వహించారు. వెంకటాచలం మండలం, ఇడిమేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక గిరిజనులతో కలిసి అంబేడ్కర్ జీవిత విశేషాలు, ఆయన ఆశయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ, “అంబేడ్కర్ గారు ప్రపంచ స్థాయి మేధావి మాత్రమే కాకుండా, భారత రాజ్యాంగ రూపకర్తగా, పేదలకు న్యాయం కలిగించేందుకు నిరంతరంగా పోరాడిన యోధుడు. ఆయన ఆశయాలను నిజం చేయాలంటే, మనం ఓటు అనే ఆయుధాన్ని వినియోగించాలి. నీతి, నిజాయితీతో పేదల కోసం పనిచేసే నాయకులను గెలిపించడం ద్వారానే అంబేడ్కర్ కలలు నిజమవుతాయి” అని తెలిపారు. అంతేకాక, ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మహేష్, సందూరి శ్రీహరి, చల్లా చెంచయ్య, మణి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలు గిరిజన ప్రాంతాల్లో అంబేడ్కర్ భావజాలాన్ని చేరువ చేసాయి.

Share this content:

Post Comment