భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్‌లో వీరమహిళ శ్రీమతి రావూరి కల్పన ఆధ్వర్యంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విజయవాడ తూర్పు నియోజకవర్గం, పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ అమ్మిశెట్టి వాసు ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర ఉపాధ్యక్షుడు శ్రీ కామాల్ల సోమనాథం, జనసేన నాయకులు లకనం శ్యామ్ ప్రసాద్, వివిధ డివిజన్ల అధ్యక్షులు, నగర కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వీరమహిళలు పాల్గొన్నారు. ఈ వేడుకలు విశేష ప్రజాకర్షణతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.
Share this content:
Post Comment