గుంటూరు జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

గుంటూరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం గుంటూరు పట్టణంలోని సంగడిగుంట 17వ డివిజన్ జనసేన ప్రెసిడెంట్ ఉస్థ ఏడుకొండలు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టి రాష్ట్ర కార్యదర్శి శ్రీవడ్రాణం మార్కండేయబాబు, గుంటూరు పట్టణ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్, గుంటూరు క్రిష్టా జిల్లాల కోర్థినేటర్ శ్రీమతి బోని పార్వతి నాయుడు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈకార్యక్రమంలో గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, జనసేన పార్టి మహిళా నాయకురాలు శ్రీమతి పాకనాటి రమాదేవి, గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి యడ్ల నాగమల్లేశ్వరరావు, నగర కార్యదర్శులు బండారు రవీంద్ర, పావులూరి కోటేశ్వరరావు జడ సురేష్, మాదాసు శేఖర్, డివిజన్ అధ్యక్షులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.