తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు మండల నాయకులు కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలోని అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. అతను రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమాన హక్కులు మరియు సమానత్వాన్ని కల్పించిన గొప్ప నాయకుడిగా ప్రశంసించారు. ఆయన ఆశయాలతో, అతను చూపించిన మార్గంలో ప్రతిఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు.

Share this content:

Post Comment