తోట ఓబులేసు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

సింగనమల: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జనసేన పార్టీ సింగనమల మండల అధ్యక్షుడు తోట ఓబులేసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ సింగనమల మండలం నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. తోట ఓబులేసు మాట్లాడుతూ భారత రాజ్యాంగ సభలో అనేకమంది సభ్యులు ఉన్నప్పటికీ, రాజ్యాంగ రచనా భారం డా. బి. ఆర్. అంబేద్కర్ పైనే ఎక్కువుగా పడింది. అంబేద్కర్ కు ఇంగ్లిష్ భాషపై బాగా పట్టు ఉండటం, అనేక పుస్తకాలు చదివి ఉండటం, అణగారిన వర్గాల వారి సమస్యలు గురించి ఆయనకు లోతైన అవగాహన ఉండటం, చివర్లో రాజ్యాంగ సభలో పలువురు కీలక సభ్యులు వివిధ కారణాలతో రాజ్యాంగ రచనలో చురుకుగా లేక పోవడం వంటి వాటి వల్ల అంబేద్కర్ రాజ్యాంగ రచనలో కీలక పాత్రను పోషించారు. అందుకే ఆయనను భారత రాజ్యాంగ నిర్మాత లేదా భారత రాజ్యాంగ పిత అని పిలుస్తారు.ఆయన అభివృద్ధికి ఆటంకమైన అంటరానితనాన్ని నిషేధిస్తూ రాజ్యాంగంలో రక్షణ కల్పించారు. స్వేచ్ఛ సమానతలు.. విద్యా హక్కు.. మతస్వేచ్ఛ.. ఓటు హక్కు ఇలా అనేక అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. బడుగు బలహీన వర్గాల వారు పాలకులుగా రాణించాలని.. అప్పుడే సామాజిక, ఆర్థిక అసమానతలు రూపు మారతాయని అంబేద్కర్ గారి కల అని తోట ఓబులేసు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు తోట రామ్మోహన్, సాయి శంకర్, మధు శేఖర్, కిరణ్ కుమార్ మధు, శీను తదితరులు పాల్గొన్నారు.