నిడదవోలు జనసేన ఆద్వర్యంలో అంబేద్కర్ జయంతి

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, ఉనకరమిల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి గజమాలతో ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండలం అధ్యక్షులు పోలీరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఆయన ఆశయ సాధన కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.