అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడవాలి

*జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ రావు

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “అంటరానితన నిర్మూలన కోసం అంబేద్కర్ చేసిన కృషి, రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు సమన్యాయం కల్పించడానికి ఆయన చూపిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. స్వేచ్ఛ, సమానత్వం కోసం, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ గారు చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలి. రాజ్యాంగంలో ఆయన కల్పించిన హక్కులను సమాజంలోని మహిళలు, బలహీనవర్గాల ప్రజలు ఉపయోగించగలిగితేనే ఆయనకిచ్చే నిజమైన నివాళి అవుతుంది” అని పేర్కొన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ యువత అంబేద్కర్ ఆశయాల పట్ల కట్టుబాటుతో ఉండి, రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రూపకర్త మాత్రమే కాకుండా, సమాజ సంస్కరణలకు ఆద్యుడు అని కొనియాడారు. ఇక నియోజకవర్గ పిఒసి కె.మోహన్ మాట్లాడుతూ.. “డాక్టర్ అంబేద్కర్ గారు దళితులు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన యోధుడు. ఆయన నాయకత్వ లక్షణాలు ఈ తరం యువతకు మార్గదర్శకంగా ఉండాలి” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగార్జున, సాయి, తిరుపాల్, వంశీ, కార్తీక్, రవి, శివాజీ, సునీల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment