అంబేద్కర్ ఆశయాలు నేటి యువతకు ఆదర్శనీయం ఆచరణీయం

  • అంబేద్కర్ జయంతోత్సవాల్లో జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం: భారత రాజ్యాంగ నిర్మాత, సామాజికసేవకులు, నాయ్యనిపుణులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జన్మదినోత్సవం సందర్భంగా గొల్లప్రోలుమండలం, దుర్గాడగ్రామంలో అంబేద్కర్ సెంటర్ వద్ద గల బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. సదరు అంబేద్కర్ 134వ జయంతోత్సవాలకు దుర్గాడ స్దానిక అంబేద్కర్ యూత్ గౌరవ అధ్యక్షులు దడాల రాజు, అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ ముర్రే దుర్గాప్రసాద్ ఆహ్వానం మేరకు స్దానిక జనసేన నాయకులు మరియు ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు హాజరై ముందుగా బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతుల శ్రీనివాసు తదితరులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేటి యువతకు ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయాలు నేటి యువతకు ఆచరణీయమని ఈ సందర్భంగా తెలియజేశారు.బి ఆర్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం భారత రాజ్యాంగం నందు అనేక హక్కులను పొందుపరిచారు. భారత రాజ్యాంగం నిర్మాణ సందర్భంలో బి ఆర్ అంబేద్కర్ నేను మీకు హక్కులను భారత రాజ్యాంగంలో పొందుపరిచాను కాని హక్కులను మీరు కాపాడుకోవాలని అవసరమైతే ఉద్యమాల ద్వారా సాధించుకోవాలని బి ఆర్ అంబేద్కర్ యువతను ఉద్దేశించి ప్రసంగించారని జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు. నేటి యువత అంతా బి ఆర్ అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకుని మన సమాజానికి తగిన సేవలను అందివ్వాలని ఈ సందర్భంగా జ్యోతులు శ్రీనివాసు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుర్గాడ గ్రామజనసేన నాయకులు గొల్లపల్లి శివబాబు, ఇంటి వీరబాబు, శేఖ సురేష్, జ్యోతుల వీరబాబు, మేడిబోయిన శ్రీను, జ్యోతుల గోపి, స్థానిక అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ ముర్రే దుర్గప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ దడాలనాగరాజు, కార్యదర్శి బత్తులఅబ్బాయి, జాయింట్ కార్యదర్శి శివకోటి అర్జునుడు, ట్రెజరర్ ఎద్దు సారయ్య, జాయింట్ ట్రెజరర్ దెయ్యాల పెద్దోడు,స్థానిక దళిత నాయకులు శివకోటి అర్జునుడు, గళ్ళ ప్రసాదు, కీర్తి చిన్న, జీలకర్ర భాను నాగబోయిన వీరబాబు, సఖినాల లచ్చబాబు, రేలంగి సూర్య తదితరులు పాల్గొన్నారు.