అంబేద్కర్ జీవిత సంఘర్షనే, ఆయన మనకు ఇచ్చే సందేశం

కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గం, అంటరాని తనం అనుభూతి నుండి ప్రపంచ మేధావిగా ఎదిగిన కృషీవలుడు బాబా సాహెబ్ డా.బి.ఆర్ అంబేద్కర్,ఆయన అణగారిన వర్గాలకు ఇచ్చిన బ్రహ్మస్త్రం ఓటు హక్కు, ఆయన ఆశయాలను కలసికట్టుగా తీసుకువెళ్ళి రాజ్యాధికారం సాధించాలని, ప్రస్తుత తరం ఆలోచించాల్సింది కూడు-గూడు-గుడ్డ కాదు, విద్య-వైద్యం-ఉపాధి-రాజ్యాధికారం అని డా.బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్బంగా కృష్ణా జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు, పచ్చిగళ్ళ సుధీర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పి.శంకు, కె. వీరాంజనేయులు, ఈ. ఆంధ్రకేశవులు, వి. నరేష్, పి. నవీన్ మరియు స్థానికులు కూరపాటి శేఖర్, గోపాలకృష్ణ, సవీన్ పాల్గొని మొక్కలు నాటారు.